యాత్ర 2 నుండి.. తొలి సమరం సాంగ్ రిలీజ్

Tholi Samaram Video Song Out From Yatra 2

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘యాత్ర 2’. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన ‘యాత్ర’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్‌) పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా.. ఆయన తనయుడు ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌గా ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇప్ప‌టికే ‘యాత్ర 2’ నుంచి మోషన్ పోస్టర్, ఫ‌స్ట్‌లుక్, టీజర్ విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. యాత్ర 2 నుండి సెకండ్ సింగిల్ విడుదలయింది. ఈ మేరకు మేకర్స్ నిన్న ప్రకటించినట్లుగానే ఈ ఉదయం 11 గంటలకు ‘తొలి సమరం’ అంటూ సాగే వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇందులో వైఎస్ జగన్ (జీవా) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం, పార్టీ తరపున ఎన్నికల శంఖారావం పూరించడం, ప్రచారంలో పార్టీ గుర్తు ‘ఫ్యాన్’ని ప్రదర్శించడం వంటి దృశ్యాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలను దర్శకుడు మహి వి రాఘవ్ అద్భుతంగా చూపించారు.

కాగా ‘యాత్ర 2’లో ప్రధానంగా సీఎం జగన్ రాజకీయ రంగప్రవేశం, అందుకు దారి తీసిన పరిస్థితులు, సొంతంగా వైఎస్సార్సీపీ పార్టీని స్థాపించడం, ప్రతిపక్షనాయకుడిగా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేయడం.. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం వంటివాటిని చూపించనున్నారు. ఈ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ బ్యానర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. ఫిబ్రవరి 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.