డెవిల్ రివ్యూ..ఇంట్రెస్టింగ్ స్పై డ్రామా

kalyan ram devil movie review

అభిషేక్ నామా దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ నేపథ్యంలో ఈసినిమా రూపొందించారు. ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటించగా మొదటి నుండీ కూడా ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్, మాళవిక నాయర్, సత్య, అజయ్ తదితరులు
దర్శకత్వం..అభిషేక్ నామా
బ్యానర్స్.. అభిషేక్ పిక్చర్స్
నిర్మాతలు..అభిషేక్ నామా
సినిమాటోగ్రఫి..సౌందర్ రాజన్.ఎస్
సంగీతం..హర్షవర్ధన్ రామేశ్వర్

కథ

బ్రిటిష్ పరిపాలన నేపథ్యంలో జరిగిన కథ ఇది. రాసపాడు జమీందారు కూతురు విజయ (అభిరామి) హత్య జరుగుతుంది. కూతుర్ని హత్య చేశారన్న ఆరోపణల మీద జమీందారుని అరెస్ట్ చేస్తారు. ఈ కేసును చేధించేందుకు బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్) రంగంలోకి దిగుతాడు. ఈ కేసులో జమీందారు మేనకోడలు నైషధ (సంయుక్త మీనన్)ను డెవిల్ ఓ కంట కనిపెడుతుంటాడు. మరోవైపు ఇండియ‌న్ నేష‌న‌ల్ ఆర్మీ చీఫ్ సుభాష్ చంద్ర‌బోస్ ఇండియా ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తుంటారు బ్రిటిష్ వాళ్లు. అసలు ఈ కేసుకు, బోస్‌‌ను పట్టుకునే మిషన్‌కు ఉన్న లింక్ ఏంటి? నైషధ కి నేతాజీకి ఉన్న సంబంధం ఏమిటి ? అనేది ఈసినిమా కథ

విశ్లేషణ

ఈమధ్య కళ్యాణ్ రామ్ కూడా డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అలానే బింబిసార తో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. ఆ తరువాత అమిగోస్ అంటూ వచ్చారు కానీ ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు డెవిల్ అంటూ వచ్చేశాడు. అయితే గత చిత్రాల కంటే భిన్నంగా బ్రిటిష్ నేపథ్యంలో ఈసారి మైండ్ గేమ్ యాక్షన్ డ్రామాతో సీక్రెట్ ఏజెంట్ గా వచ్చాడు. ఇక ఈసినిమా కథ విషయానికి వస్తే..నేతాజీ చరిత్రకు ముడిపెడుతూ ఓ సీక్రెట్ ఏజెంట్ పాత్రని సృష్టించి.. అందులోనే మర్డర్ మిస్టరీ, స్వతంత్ర పోరాటం నేపధ్యంలో ఈ కథని నడిపాడు దర్శకుడు.

ఫ‌స్ట్ హాప్ మొత్తం జ‌మీందారు కూతురు మ‌ర్డ‌ర్‌, డెవిల్ ఇన్వేస్టిగేష‌న్ చుట్టూ సాగుతుంది. అంద‌రిపై అనుమానం రేకెత్తించేలా ఆ ఇన్వేస్టిగేష‌న్ డ్రామా ఆస‌క్తిక‌రంగా న‌డుస్తుంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో త్రివర్ణ పాత్రకు సంబంధించి రివీల్ అయ్యే ట్విస్ట్, ప్రధాన యాక్షన్ సన్నివేశాలు, ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి.

పెర్ఫామెన్స్

కళ్యాణ్ రామ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు షేడ్స్‌లో అద్భుతంగా కనిపిస్తాడు. అంతే అద్భుతంగా నటించాడు. యాక్షన్ సీన్స్ లో ఆకట్టుకున్నారు. ఇక హీరోయిన్ గా నటించిన సంయుక్త మీనన్ కు ఈసినిమాలో కూడా ఇంపార్టెంట్ రోలే దక్కిదని చెప్పొచ్చు. నైషధ పాత్రలో చాలా బాగా నటించింది. మాళవిక నాయర్ అప్పియరెన్స్, పాత్ర తీరు బాగుంటుంది. ఇక మిగిలిన పాత్రల్లో నటించిన వశిష్ట, షఫీ, మహేష్, కమెడియన్ సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, అభిరామి, ఏస్తర్ ఇలా అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ వాల్యూస్

ఇక సాంకేతిక విభాగానికి వస్తే.. టెక్నికల్ వాల్యూస్ కూడా ఈసినిమా ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా సౌందర్ రాజన్.ఎస్ అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. పీరియాడిక్ సినిమా కాబట్టి ఆకాలంనాటి వాతావారణాన్ని చాలా బాగా చూపించాడు. ఇక హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన సంగీతం కూడా చాలా బాగుంది. తను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల చాలా సీన్లు హైలెట్ అయ్యాయి. నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ప్రేక్షకులు కూడా థ్రిల్లర్ సినిమాలు చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్లకి ఈసినిమా బాగా నచ్చుతుంది. అందరూ ఒకసారి ఈసినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − six =