బ్రహ్మానందం ఆత్మకథ ‘నేను’పై.. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Megastar Chiranjeevi Interesting Comments on Brahmanandam Autobiography

టాలీవుడ్‌లోని గొప్ప హాస్యనటుల్లో బ్రహ్మానందం ఒకరు. కొన్ని దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరిస్తున్న ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించారు. 1200కి పైగా చిత్రాలలో నటించి గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కేశారు. ఎంతటి బాధలో ఉన్నవారైనా సరే ఒక్కసారి ఆయనను చూస్తే చాలు.. నవ్వకుండా ఉండలేరు. బ్రహ్మానందం పోషించిన పాత్రలు, వాటి తాలూకు హావభావాలు ప్రస్తుతం మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయంటే.. ప్రజెంట్ జెనరేషన్ కూడా ఆయనను ఎంతగా అభిమానిస్తారో అర్ధం చేసుకోవచ్చు. తనకే సాధ్యమైన అద్భుతమైన కామెడీతో అందరినీ నవ్వించి హాస్య బ్రహ్మ అనిపించుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ప్రస్తుతం సినిమాల్లో నటించడం తగ్గించిన బ్రహ్మానందం.. తనకు ఇష్టమైన వ్యాపకాలతో బిజీగా ఉన్నారు. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన సినిమా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా ఎదిగిన తీరు ఎంతోమంది వర్ధమాన కళాకారులకు స్ఫూర్తి. అలాంటి బ్రహ్మానందం.. తాజాగా తన జీవిత విశేషాలతో పాటు.. తన అనుభవాలను ఆత్మకథగా తెస్తున్నారు. దీనిని ‘నేను – మీ బ్రహ్మానందం’ పేరుతో ఒక పుస్తక రూపంలో అక్షరబద్దం చేశారు. కాగా ఈ పుస్తకం తొలి ప్రతిని బ్రహ్మానందం తన సతీమణి లక్ష్మికి అందించడం విశేషం. ఈ మేరకు విషయాన్ని వారి తనయుడు నటుడు గౌతమ్ సోషల్ మీడియాలో వెల్లడించారు.

ఇక బ్రహ్మానందం తన ఆటో బయోగ్రఫీ రాయడంపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఎక్స్ వేదికగా బ్రహ్మానందంకు శుభాకాంక్షలు తెలిపారు. తన ఆత్మకథని పుస్తకంగా మలిచిన బ్రహ్మానందంతో పాటు దీనిని ప్రచురించిన ‘అన్వీక్షి’ని మెగాస్టార్ అభినందించారు. ఇక ఇదిలా ఉండగా.. ప్రస్తుతం చిరంజీవి ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ఒక కొత్త సినిమాను చేస్తున్నారు. సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =