తండేల్ షూట్ లో జాయిన్ అయిన సాయి పల్లవి

Sai Pallavi Joins In Thandel Shooting

రీసెంట్ గానే కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ హీరో నాగ చైతన్య. ఈసినిమా సరైన విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా షూటింగ్ ను రీసెంట్ గానే స్టార్ట్ చేశారు మేకర్స్. ప్రస్తుతం అయితే కర్ణాటకలోని ఉడిపి లో ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ కీలక షెడ్యూల్ లో చిత్ర యూనిట్ టాకీ, యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక తాజాగా మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ షూట్ లో సాయి పల్లవి కూడా నేటి నుండి జాయిన్ అవుతున్నట్టు తెలిపింది. అంతేకాదు ఎగ్జైటింగ్ అప్ డేట్లు కూడా త్వరలో ఇవ్వబోతున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈసినిమాను నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =