టాలీవుడ్ యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. కాగా ‘జనతా గ్యారేజ్’ సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనికితోడు.. వరల్డ్‌వైడ్ బ్లాక్ బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడం వలన కూడా ‘దేవర’పై అంతటా ఆసక్తి నెలకొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Music Director @anirudhofficial says #AllHailTheTiger 🐅
Do we need to say anything more?#Devara Teaser 🌊 🔜💥#JrNTR #KoratalaSiva #TeluguFilmNagar pic.twitter.com/8CGvuzylGD
— Telugu FilmNagar (@telugufilmnagar) December 26, 2023
కాగా దేవర సినిమా అప్‌డేట్స్ గురించి తారక్ ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక అదిరిపోయే సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. ‘దేవర’ టీజర్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టడం గమనార్హం. అందులో ‘దేవర’ టీజర్ అని రాసి పక్కన చప్పట్లు కొట్టే ఎమోజీలు, ఎన్టీఆర్, కొరటాల శివ ఆన్ ఫైర్, ఐయామ్ ఎగ్జయిటెడ్ అన్నట్టుగా పోస్టు చేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. #AllHailTheTiger, #DevaraTeaser అనే యాష్ ట్యాగ్‌లతో నెట్టింట ట్రెండింగ్‌లోకి తీసుకు వచ్చారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్, సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దేవర’ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. ఈ క్రమంలో మొదటి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా.. సాబు సిరిల్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా తర్వాత తారక్ ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌లో హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటించనున్నారు. అలాగే ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ భారీ చిత్రం చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: