డబుల్ ఇస్మార్ట్‌ 100 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్‌ రిలీజ్

Double iSmart 100 Days Countdown Poster Released

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’. వీరి కలయికలో 2019లో వచ్చి సూపర్ హిట్టైన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ ముంబైలో జరుపుకుంటుండగా.. ఈ షెడ్యూల్‌లో హీరో రామ్, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌ సహా చిత్రంలోని ప్రధాన తారాగణం అంతా పాల్గొంటోంది. ఇందులో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తుండగా.. మరి కొందరు ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో.. ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి ఒక సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని మరోసారి స్పష్టం చేశారు. ముందుగా అనౌన్స్ చేసినట్లు మహా శివరాత్రి కానుకగా వచ్చే ఏడాది మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుందని తేల్చి చెప్పారు. ఇక ఈ సందర్భంగా మేకర్స్ ‘డబుల్ ఇస్మార్ట్’ 100 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో రామ్ పోతినేనిని ట్రెండీ హెయిర్‌డో, షేడ్స్ ధరించి సూపర్ స్టైలిష్ ఇంకా మ్యాసీవ్ అవతార్‌లో కనిపించారు. షర్టు, జీన్స్‌తో జాకెట్ ధరించి, తుపాకీని పట్టుకొని టెర్రిఫిక్‌గా కనిపించారు రామ్. అలాగే ఆయన వెనుక చాలా వెపన్స్ ఉన్నాయి. సినిమాలో మనం చూడబోతున్న మాస్, యాక్షన్ వైబ్ ని ఈ పోస్టర్ సూచిస్తుంది.

కాగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ క్రేజీ ఎంటర్‌టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేస్తుండటం గమనార్హం. అలాగే స్టంట్ డైరెక్టర్ కేచ నేతృత్వంలో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కంపోజ్ చేస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్‌’ సహా పలు చిత్రాలలో పూరీ జగన్నాధ్‌కు సెన్సేషనల్ మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ ‘డబుల్ ఇస్మార్ట్‌’కు సంగీతం అందిస్తున్నారు. కాగా వచ్చే ఏడాది మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =