హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా వార్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు దాని సీక్వెల్ గా వార్ 2 సినిమా రానుంది. సీక్వెల్లో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈసినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. క్రేజీ కాంబినేషన్స్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈసినిమా రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ వచ్చింది. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. 2025 ఇండిపెండెన్స్ సందర్భంగా ఆగష్ట్ 14వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
Most Anticipated film #WAR2 released date is locked🔥
Can’t wait to witness the epic cross over at yuddhabhoomi 😎#JrNTR #HrithikRoshan #TeluguFilmNagar pic.twitter.com/4ZAVxHrgKa
— Telugu FilmNagar (@telugufilmnagar) November 29, 2023
కాగా ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి ఎన్టీఆర్ కూడా ఈ షూట్ లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈసినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్ లోనే ఉండబోతున్నట్టు ఇప్పటికే అయాన్ ముఖర్జీ తెలిపాడు. ఇక ఈ భారీ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ పై నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: