సలార్‌.. జగపతిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్, పోస్ట్ వైరల్

Jagapathi Babu Interesting Post on Prabhas's Salaar Goes Viral

పాన్ ఇండియా హీరో, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘సలార్‌’. ఈ సినిమా కోసం ఒక్క టాలీవుడ్‌ లోనే కాకుండా వరల్డ్‌వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ గూజ్ బంప్స్‌ తెప్పించే విజువల్స్‌ తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ‘కేజీఎఫ్‌’ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్’ రెండు పార్టులుగా రాబోతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. ‘సలార్‌: పార్ట్-1 సీజ్ ఫైర్’ సినిమా డిసెంబర్ 22 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరో 50 రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో.. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు ‘సలార్‌’పై సోష‌ల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆయన పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఇలా ఉంది.. ”స‌లార్‌తో పై మెట్టు ఎక్క‌బోతున్నాను” అని పేర్కొన్నారు. దీంతో ఈ మూవీ విడుద‌ల అయ్యాక నటుడిగా తన గ్రాఫ్ పెరుగనుందని జగపతిబాబు చెప్పకనే చెప్పారు. అంతేకాకుండా ఈ సినిమాలో జగ్గూభాయ్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నారని, ఆ పాత్రలో ఆయన విజృంభించి నటించి ఉంటారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో జగపతిబాబు ‘రాజమన్నార్’ అనే కీలక పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

ఇక తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతోన్న సలార్ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌కు ‘కేజీఎఫ్‌’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. కాగా సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీతో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ‘సలార్’లో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ఈశ్వ‌రీ రావు తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

కాగా ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండనుంది. మూవీలో వచ్చే ఒక ఆన్-గ్రౌండ్ యాక్షన్ సీక్వెన్స్‌ కోసం జీప్‌లు, ట్యాంకులు, ట్రక్కులు మొదలైన వాటితో సహా మొత్తం 750కి పైగా భారీ వాహనాలను వినియోగిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇది ఒక హాలీవుడ్ సినిమాల్లో కనిపించే వార్ సీక్వెన్స్ అంత పెద్దది కావడం గమనార్హం. ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం మరియు హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + five =