బబుల్ గమ్ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

Roshans Bubble Gum Movie First Single Release Date

ఇండస్ట్రీలోకి ఇప్పటివరకూ ఎంతోమంది వారసులు ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ వారసుడు ఎవరో కాదు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న సుమ కనకాల తనయుడు రోషన్. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా వస్తున్న సినిమా బబుల్ గమ్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఈసినిమా టీజర్ ను రీసెంట్ గానే రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. రోషన్ హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా ఫస్ట్ సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. హబీబీ జిలేబీ అంటూ వచ్చే ఈ పాటను నవంబర్ 3వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడుతుండగా.. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందిస్తున్నాడు.

కాగా ఈసినిమాలో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం.. సురేష్ రగుతు సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 2 =