దళపతి విజయ్ నటించిన లియో దసరా సీజన్ లో విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ఒక్క తమిళంలోనే కాదు ఇతర భాషల్లోనూ సూపర్ వసూళ్ల తో బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఇక ఈసినిమా తమిళనాడు లో జైలర్ రికార్డు ను బ్రేక్ చేసింది. జైలర్,తమిళనాడులో 195కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. దాంతో అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండో సినిమాగా రికార్డులోకెక్కింది. అయితే తాజాగా లియో ఆ ప్లేస్ ను ఆక్రమించింది.లియో కేవలం 12రోజుల్లోనే 200కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ తో ఆల్ టైం టాప్ 2 ప్లేస్ లోకి వెళ్ళింది.పొన్నియన్ సెల్వన్ పార్ట్ 225కోట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుంది.లియోకి ఇప్పుడు దీన్ని బీట్ చేసి మొదటి స్థానం లో రావడానికి ఛాన్స్ వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక లియో తెలుగులో కూడా సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకుంది.దాదాపు 45కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టి బయ్యర్ల కు లాభాలను తీసుకొచ్చింది. అంతేకాదు విజయ్ మార్కెట్ ను డబుల్ చేసింది.ఓవరాల్ గా లియో 12రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 540కోట్లకు పైగా రాబట్టిందని నిర్మాతలు ప్రకటించారు.ఈవారంలో 600కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.అదే జరిగితే విజయ్ కు ఇదే మొదటి 600కోట్ల సినిమా కానుంది.లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈసినిమాను నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: