ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్- నాగవంశీ బెస్ట్ విషెస్

producer naga vamsi best wishes to Extra Ordinary Man movie

స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్. ఇక భీష్మ తరువాత ఇప్పటివరకూ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయిన నితిన్ ఈసినిమాతో ఎలాగైనా మంచి హిట్ ను కొట్టాలని చూస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఒకవైపు షూటింగ్ ను జరుపుకుంటూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగానే చిన్నగా పాటలు, పోస్టర్లు రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇక నిన్న టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే ఫన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. టీజర్ అయితే సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇప్పుడు తాజాగా టీజర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ప్రశంసించాడు. ఎక్స్ ట్రా ఆర్డినరీ టీజర్ ఎంటర్ టైనింగ్ గా ఫన్ గా ఉందని తెలుపుతూ హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల తో పాటు చిత్రయూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ అందించారు.

కాగా ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 23వ తేదీన ఈసినిమాను విడుదల చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + nineteen =