తమిళ హీరో తల అజిత్, టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.ఫైట్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.మార్క్ ఆంటోనీతో హిట్ ఇచ్చిన డైరెక్టర్ అద్విక్ రవి చంద్రన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నిన్న ఈసినిమా నుండి అజిత్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఇందులో టైటిల్ కు తగ్గట్లు గుడ్ ,బ్యాడ్,అగ్లీ ఇలా త్రి స్టిల్స్ తో అజిత్ కనిపించాడు.పోస్టర్ లో అజిత్ లుక్ మాత్రం అదిరిపోయింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది.ఈసినిమా పై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.
Expect the unexpected!#GoodBadUgly In Cinemas Pongal 2025 🔥
Shooting in Progress!
#AjithKumar @MythriOfficial @Adhikravi @ThisIsDSP @AbinandhanR @editorvijay @GoodBadUglyoffl @SureshChandraa @supremesundar #Kaloianvodenicharov #Anuvardhan… pic.twitter.com/G47WLIFpnb— Mythri Movie Makers (@MythriOfficial) May 19, 2024
అజిత్ ఈసినిమాతో పాటుతోపాటు ప్రస్తుతం విడా ముయార్చి అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. మగిజ్ తిరుమనేని డైరెక్ట్ చేస్తుండగా అర్జున్ సర్జా ,త్రిష,ఆండ్రియా జెర్మియా, అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.అజిత్ చివరి రెండు సినిమాలతో నిరాశపరచడంతో ఇప్పుడు చేస్తున్న ఈరెండు సినిమాలతో ఎలాగైనా హిట్లు కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























