రివ్యూ : లియో

leo movie telugu review

నటీనటులు : విజయ్,త్రిష,సంజయ్ దత్,అర్జున్ సర్జా
ఎడిటింగ్ : ఫిలోమిన్ రాజ్
సంగీతం : అనిరుధ్
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస
దర్శకత్వం :లోకేష్ కనగరాజ్
నిర్మాత : లలిత్ కుమార్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఖైదీ లోకేష్ కనగరాజ్ ను ఓవర్నైట్ స్టార్ డైరెక్టర్ ను చేసింది.తమిళ లోనే కాదు తెలుగులోనూ ఈసినిమా బ్లాక్ బాస్టర్ కావడంతో డైరెక్టర్ కు మంచి గుర్తింపు లభించింది.ఈసినిమా తరువాత లోకేష్ తీసిన మాస్టర్ హిట్ కాగా విక్రమ్ తో ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఈసినిమా తరువాత లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ తో లియో తెరకెక్కించాడు.విడుదలకు ముందే 100కోట్లకు పైగా అడ్వాన్క్ బుకింగ్స్ తో సెన్సేషన్ సృష్టించింది.ఇక ఈరోజే ఈసినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈసినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం .

కథ :
పార్థిబన్ (విజయ్) హిమాచల్ ప్రదేశ్ లో కాఫీ షాప్ నడుపుతుంటాడు.అయితే పార్థిబన్ అలాగే తన లైఫ్ పార్టనర్ సత్య ( త్రిష ) వారి ఇద్దరి పిల్లలు మీద వరసగా అటాక్ లు జరుగుతుంటాయి.అసలు పార్థిబన్ ఫ్యామిలీ ఎందుకు టార్గెట్ చేస్తారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతనికి ఆంథోనీ దాస్ కు వున్నా సంబంధం ఏంటి అనేది మిగితా కథ.

విశ్లేషణ :

స్టోరీ పరంగా చూస్తే లియో ను సింగల్ పాయింట్ మీదనే నడిపించాడు లోకేష్.తన బలం స్క్రీన్ ప్లే. ఈ సినిమాను కూడా రేసీ స్క్రీన్ ప్లే తో నడిపించాడు.వీటికి తోడు పవర్ ఫుల్ క్యారెక్టర్లను రాసుకున్నాడు. దాంతో లియో ఎక్కడా బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది.విజయ్ స్క్రీన్ ప్రెజన్స్,హైనా తో ఫైట్ , ఛేజింగ్ సీన్స్,యాక్షన్ సీన్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తాయి.ఇదే హై ఇంటర్వెల్ వరకు కొనసాగుతుంది.ఇక ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఇంపాక్ట్ తో సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరుగుతాయి.

అయితే సెకండ్ హాఫ్ కూడా ఎక్కడా నిరాశపరచదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను మాత్రం ఇంకొంచెం బాగా రాసుకొని ఉండాల్సింది. క్లైమాక్స్ ఫైట్ తో సినిమా మళ్ళీ ట్రాక్ లోకి వస్తుంది. అంతేకాదు లియో ను ఎల్ సి యు కి కనెక్ట్ చేసిన తీరు కూడా బాగుంది.విజయ్ నటన ,లోకేష్ డైరెక్షన్ ,అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ సినిమాకు మెయిన్ పిల్లర్లుగా గా నిలిచాయి.అనిరుధ్ బీజీఎమ్ చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసింది.నేను రెడీ సాంగ్ లో విజయ్ డ్యాన్స్ మెప్పిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే డిఫరెంట్ షేడ్స్ వున్న పాత్రలో విజయ్ అదరగొట్టాడు.ఎనర్జిటిక్ యాక్టింగ్ తో స్టయిలిష్ లుక్ తో ఆకట్టుకున్నాడు.అలాగే సత్య గా త్రిష మెప్పించింది. విజయ్-త్రిష ల కెమిస్ట్రీ బాగుంది. ఆంథోనీ దాస్ గా సంజయ్ దత్ ,హరోల్డ్ దాస్ గా అర్జున్ కు పవర్ ఫుల్ పాత్రలు పడ్డాయి. వీరితోపాటు గౌతమ్ వాసు దేవ్ మీనన్ ,మండోన్నా సెబాస్టీయన్ ,మిస్కిన్ తదితరులు పాత్రల పరిధిమేర నటించారు.

టెక్నీకల్ విషయానికి వస్తే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన బలాన్ని నమ్ముకొని సింగల్ పాయింట్ స్టోరీ తో కూడా సినిమాను అద్బుతంగా తెరమీద కు తీసుకొచ్చాడు. ఇక అనిరుధ్ సంగీతం సినిమాకు మెయిన్ హైలైట్ అయ్యింది.లోకేష్ కనగరాజ్ -అనిరుద్ కాంబినేషన్ ఎప్పుడు డిస్సపాయింట్ చేయలేదు.లియో సాంగ్స్ డీసెంట్ గా అనిపించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా క్వాలిటీ గా ఇచ్చాడు. అన్బరివ్ స్టంట్స్ కూడా సినిమాలో హైలైట్ అయ్యాయి.మనోజ్ పరమహంస విజువల్స్ గ్రాండియర్ గా వున్నాయి.ఎడిటింగ్ డీసెంట్ గా వుంది.లలిత్ కుమార్ సినిమాకు బాగానే ఖర్చు చేశాడు.

ఓవరాల్ గా భారీ హైప్ తో వచ్చిన లియో అంచనాలను అందుకుంటూ ఎక్కడా నిరాశపరచలేదు. విజయ్ నటన,అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో హైలైట్ అయ్యాయి.యాక్షన్ సినిమాలు నచ్చే వారికి లియో బాగా నచ్చుతుంది.మిగితా వారు కూడా ఓసారి ట్రై చేయొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − nine =