సల్మాన్ మేనకోడలితో మైత్రీ మూవీ మేకర్స్ బాలీవుడ్ ఎంట్రీ

mythri movie makers bollywood entry with salman khans niece

చాలా తక్కవ కాలంలో మంచి పేరును సంపాదించుకుంది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్. తీసిన సినిమాలన్నీ హిట్టవ్వడం.. అవి కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడం.. వరుస పెట్టి సినిమాలు తీస్తుండటంతో ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ బ్యానర్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు పలు సినిమాలు క్యూలో ఉన్నాయి. అయితే మైత్రీ మార్క్ ని ఇంకాస్త పెంచాలని ఈ టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నారు. నిజానికి మైత్రీ మూవీ మేకర్స్ వారు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు అది కూడా సల్మాన్ ఖాన్ తో సినిమా ఫిక్స్ అయినట్టు ఎప్పటినుండో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయి. అయితే హీరో సల్మాన్ ఖాన్ కాదు.. అసలు సంగతేంటంటే..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సల్మాన్ ఖాన్ వారసత్వంతో ఎంతో మంది బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు మేనకోడలు అలీజా ఎంట్రీ ఇవ్వబోతుంది. అలీజా ప్రధాన పాత్రలో వస్తున్న ఫర్రే అనే సినిమా వస్తుంది. ఈసినిమాను సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్, మరో నిర్మాణ సంస్థ కలిసి తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా థాయ్ సినిమా అయిన బ్యాడ్ జీనియస్ సినిమాకు రీమేక్ అని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. స్కూల్ బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. కాగా ఈసినిమాను నవంబర్ 24వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.