చంద్రముఖి 2 సక్సెస్ కోరుతూ.. రజినీకాంత్‌ ఆశీస్సులు తీసుకున్న లారెన్స్

Raghava Lawrence Meets Rajinikanth To Take Blessings For Chandramukhi 2

ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు నటుడు రాఘవ లారెన్స్ , బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘చంద్రముఖి 2’. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ (తలైవర్) నటించిన కల్ట్ మూవీ ‘చంద్రముఖి’కి సీక్వెల్ గా రూపొందింది. ఇందులో వడివేలు, రావు రమేష్, లక్ష్మి మీనన్, మహిమా నంబియార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘చంద్రముఖి’ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ పి వాసుయే ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. ఇక ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ దిగ్గజ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న తమిళం, తెలుగు మరియు హిందీ భాషల్లో పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది. లారెన్స్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుండటం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో చిత్ర కథానాయకుడు రాఘవ లారెన్స్ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. తాను సినిమాల్లో గురువుగా భావించే రజినీకాంత్‌ను కలిశారు. మంగళవారం (సెప్టెంబర్ 26, 2023) రజినీకాంత్‌ నివాసానికి వెళ్లిన ఆయన తలైవర్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ మేరకు లారెన్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

దీనికి సంబంధించి లారెన్స్ ఎక్స్ (ట్విట్టర్)లో రజినీకాంత్‌ పాదాలకు నమస్కరించిన ఫొటోతో పాటు ఇద్దరూ ఆలింగనం చేసుకున్న ఫోటోను కూడా పోస్టు చేశారు. ఈ సందర్భంగా.. “హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్.. ఈ రోజు నేను నా తలైవర్ మరియు గురువు రజనీకాంత్ ను కలిశాను. జైలర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించినందున ఆయనకు అభినందనలు తెలియజేయడానికి మరియు సెప్టెంబర్ 28న చంద్రముఖి 2 విడుదల కానున్నందున ఆశీస్సులు కోసం కలవడం జరిగింది. ఇందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎప్పుటికీ తలైవర్ గొప్పవాడే. గురవే శరణం” అని పేర్కొన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + five =