స్కంద కల్ట్ జాతర.. బరాబర్ చూసుకుందామన్న రామ్ పోతినేని

Ram Pothineni Superb Speech at Skanda Cult Jatara Event

డైరెక్టర్ బోయపాటి శ్రీను.. టాలీవుడ్‌లో హై వోల్టేజ్ యాక్షన్‌ సినిమాలు తీయడంలో ఎక్స్‌పర్ట్‌. అలాగే ఎనర్జిటిక్ క్యారక్టర్లకు పెట్టింది పేరు ఉస్తాద్ రామ్‌ పోతినేని. వీరిద్దరి కలయికలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్కంద’. అవుట్‌ ఆండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ యూనిట్ ‘స్కంద కల్ట్ జాతర’ పేరుతో కరీంనగర్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. దీనిలో భాగంగా స్కంద రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఈ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో రామ్‌ పోతినేని, నటి సయీ మంజ్రేకర్‌, సీనియర్ నటుడు శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ.. ‘స్కంద మాస్‌ సినిమా మాత్రమే కాదని, మంచి ఫ్యామిలీ స్టోరీ కూడా అని తెలిపారు. బోయపాటి శ్రీను అంటే.. యాక్షన్ సన్నివేశాలు బాగా తీస్తాడని అందరూ అంటుంటారని, అయితే ఫైట్ మాస్టర్స్ కూడా తీయగలరని అన్నారు. కథలో భావోద్వేగాలే కీలకమని, అవి ప్రేక్షకుల్ని కట్టిపడేశాలా తీయడం బోయపాటి స్పెషాలిటీ అని చెప్పారు. అలాగే ఆయన ప్రతి సినిమాలోనూ ఒక అద్భుతమైన సామాజిక అంశాన్ని స్పృశిస్తుంటారని, తద్వారా బలమైన సందేశాన్ని ఇస్తుంటారని తెలిపారు. ఈ విషయంలో బోయపాటిపై గౌరవం ఉంటుంది. ట్రైలర్‌లో చెప్పినట్లు అందరం థియేటర్‌లో బరాబర్ చూసుకుందాం’ అని అన్నారు.

ఇక ఈ చిత్రంలో రామ్ పోతినేని సరసన టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ‘మేజర్’ ఫేమ్ సయీ మంజ్రేకర్‌ మరో కీలక పాత్ర పోషిస్తోంది. అఖండ సినిమాతో అద్భుత విజయం అందుకున్న బోయపాటి శ్రీను నుంచి వస్తోన్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. దీనికితోడు ఇప్పటికే స్కంద నుంచి లాంఛ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్‌, సాంగ్స్‌కు విశేష స్పందన రావడంతో ఈ సినిమాపై అంతటా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా సాంగ్స్‌లో రామ్‌, శ్రీలీల డాన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందని సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఈ చిత్రాన్ని ప‌వ‌న్ కుమార్ స‌మ‌ర్పణలో శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్స్ ప‌తాకంపై శ్రీనివాస చిట్టూరి అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో యూఎస్‌ఏలో మొత్తంగా స్కంద 350కి పైగా లొకేషన్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీకి సంబందించి అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్టయ్యాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =