సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విని ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా బేబి. న్యూ ఏజ్ లవ్ స్టోరీ గా ఈసినిమా తెరకెక్కింది. ఈసినిమా నిజజీవితానికి దగ్గరగా ఉండటతో యూత్ బాగా కనెక్ట్ అవుతుంది. దీంతో మొదటి షోనుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా జులై 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే రోజు రిలీజ్ అయిన సినిమాలు.. ఆ తరువాత రిలీజ్ అయిన సినిమాలు కూడా అంతగా ప్రభావం చూపించలేకపోవడం కూడా ఈసినిమాకు కలిసొచ్చింది. అందుకే రిలీజ్ అయి 12 రోజులు అవుతున్నా కూడాా ఇంకా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ఒక్క మొదటిరోజే ఈసినిమా 7 కోట్లకు పైగా కలెక్షన్స్ ను కలెక్ట్ చేసింది. ఇప్పుడు 12 రోజుల్లో ఈసినిమా 71 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. అంతేకాదు ఎప్పుడో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ చేసి మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టింది. మరి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఈరేంజ్ లో సక్సెస్ సాధించడం అంటే మాములు విషయం కాదు.
12 days – 71.6 crores#BabyTheMovie pic.twitter.com/J27Q5rNOPJ
— Sai Rajesh (@sairazesh) July 26, 2023
కాగా ఈసినిమాను మాస్ మూవీ మేకర్స్‌పై ఎస్‌కేఎన్ నిర్మించారు. సినిమాకు విజయ్ బుల్ గానిన్ సంగీతం అందించారు. కాగా సినిమాటోగ్రాఫర్ గా బాల్ రెడ్డి, ఎడిటర్ గా విప్లవ్ నైషధం పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: