మా వదిన చేసిన తప్పు వల్ల ఇలా ఉన్నాను

Pawan Kalyan reveals facts about megastar chirajeevis wife surekha

మా వదిన వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నా అంటున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై మరింత బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈనేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసందర్భంగా పవర్ స్టార్ మాట్లాడుతూ తన సినిమా ఎంట్రీ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. అన్నయ్యకు మెగా స్టార్ డమ్ వచ్చిన తరువాత నన్ను అడిగారు సినిమాలు చేస్తావా అని. కానీ నా దృష్టిలో హీరో అంటే అన్నయ్య .. ఇంకా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి పెద్ద హీరోలు ఉన్నారు. నన్ను నేను హీరోగా ఎప్పుడూ ఊహించుకోలేదు. నేనేదో చిన్న బాజ్ చేసుకుంటూ పొలంలో పనిచేసుకుంటూ బ్రతికేద్దామనుకున్నా. అయితే మా వదిన మాత్రం నన్ను మార్చింది. ఒకసారి సుస్వాగతం సినిమా షూటింగ్ అప్పుడు ఒకసాంగ్ కోసం బస్ పైకి ఎక్కి డ్యాన్స్ చేయమన్నారు. ఆరోజు నాకు ఏడుపొచ్చేసింది. అప్పుడు మా వదినకు ఫోన్ చేసి ఎందుకు నన్ను సినిమాలు చేయమన్నావు అని అడిగాను.. ఆ రోజు మా వదిన చేసి తప్పు ఈరోజు నన్ను మీ ముందు ఇలా నిలబెట్టింది. చిరంజీవి తమ్ముడిగా వస్తున్నాను.. ఆయన కంటే నేను ఇంకా కష్టపడాలని నిర్ణయించుకున్నాను.. అలానే చేసుకుంటూ వెళ్లిపోయాను.. ఈరోజు ఇంతమంది అభిమానాన్ని సొంతంచేసుకున్నాను. ఈరోజు ఒకే కుటుంబం నుండి ఇంతమంది హీరోలు వస్తున్నారంటే కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ మేము గొడ్డు చాకిరి చేస్తాం.. దెబ్బలు తింటాం.. కడుపులు మాడ్చుకుంటాం.. నష్టాలు వస్తే తీసుకుంటాం. అందుకే ఈ పరిశ్రమ అందరిదీ.. అందరం కష్టపడి మంచి పేరు తెచ్చిపెడదాం అంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + nine =