ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా టీజర్ ను మే20వ తేదీన కేన్స్ వేదికగా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే చిత్రయూనిట్ అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక చెప్పినట్టే అక్కడ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈనేపథ్యంలో విష్ణు తన ఇన్ట్సా ద్వారా మరో అప్ డేట్ ఇచ్చాడు. కన్నప్ప టీజర్ ను కేన్స్ లో ప్రదర్శించాం.. ఇక టీజర్ ను చూసిన ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ నుండి, లోకల్ ఇండియన్స్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.వారి రియాక్షన్స్ ను చూసి నేను అనుభూతికి లోనయ్యాను. అయితే తెలుగు టీజర్ ను మే 30వ తేదీన హైద్రాబాద్ లో పాపులర్ థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నాము.. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా మిగిలిన వెర్షన్స్ ను జూన్ 13వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
View this post on Instagram
కాగా ఈసినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాటు కాజల్, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్ ఇంకా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























