మిరాయ్- మనోజ్ పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్

manchu manoj powerful glimpse out from mirai movie

రీసెంట్ గా హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు తేజ సజ్జా. ఇప్పుడు మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టేశాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా ఈ సినిమా రాబోతుంది. మిరాయ్ అనే టైటిల్ తో అడ్వంచరస్ థ్రిల్లర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి గ్లింప్స్ వరకూ అన్నీ ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమాలో తేజ సజ్జా సూపర్ యోధ లా కనిపించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాలో మంచు మనోజ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈరోజు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి ఒక సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా నుండి మనోజ్ పవర్ ఫుల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బ్లాక్ స్వార్డ్ అనే పాత్ర‌లో మ‌నోజ్ న‌టిస్తుండ‌గా.. అత్యంత ప్రమాదకరమైన విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఇందులో ఇప్పటివరకు చూడని గెటప్ లో మనోజ్ పవర్ ఫుల్ గా స్టైలీష్ లుక్ లో కనిపిస్తున్నాడు. గ్లింప్స్ అయితే ఆకట్టుకుంటుంది.

కాగా రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. గౌరా హరి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న మిరాయ్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.