రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ఇక చాలా గ్యాప్ తరువాత అశ్విన్ బాబు నుండి మరో కొత్త సినిమా వస్తుంది.అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ హిడింబ. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. దీంతో ఈ సినిమాతో అశ్విన్ హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆలస్యమవతూ వస్తుంది. దానికితోడు సెన్సార్ వల్ల కూడా ఈసినిమాకు ఇబ్బందులు తలెత్తాయి. ఈసినిమాలో ఉన్న కొన్ని యాక్షన్ సీక్వెన్స్ పట్ల సెన్సార్ బృందం వ్యతిరేకతను తెలుపడంతో మళ్లీ మార్పులు చేసి సెన్సార్ కు పంపించారు. ఇక సెన్సార్ క్లియర్ అవ్వడంతో ఇప్పుడు తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేశారు. జులై 20వ తేదీన ఈసినిమా రిలీజ్ కాబోతుందని మేకర్స్ స్పష్టం చేశారు.
కాగా నందిత శ్వేత హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో రాజీవ్ కనకాల , రఘు కుంచె , శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వికాస్ బడిసా సంగీతం అందిస్తున్నారు. ఎస్ వి కె సినిమాస్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: