తన సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు విశాల్. ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ గ్యాప్ లేకుండా బిజీ బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా ఆశించినంత విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. విశాల్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మార్క్ అంథోని. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు విశాల్. టైం ట్రావెల్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ను బట్టి అర్థమవుతుంది. ఇక చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదల చేసిన మోషన్ పోస్టర్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే వినాయక చవితికి చాలా సినిమాలు లైన్ లో ఉండగా..ఇప్పుడు ఆ లిస్ట్ లో మార్క్ అంథోోని కూడా చేరిపోయింది. వినాయక చవితికి ఈసినిమా రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా విశాల్ కు జోడీగా రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్ జె సూర్య ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమాలో సునీల్ కూడా ఒక కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నాడు. మినీ స్టూడియో బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తుండగా.. జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: