హీరో సూర్య ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఇవే..

Superstar Suriyas Diet Plan And Fitness Secrets For The Well Toned Body

దక్షిణాదిన అగ్రనటుల్లో తమిళ హీరో సూర్య ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఆయన తనదైన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే 47 సంవత్సరాల వయస్సులో కూడా సూర్య చాలా ఫిట్‌గా కనిపిస్తారు. సిక్స్ ప్యాక్‌ బాడీతో యంగ్ హీరోలతో పోటీ పడుతుంటారు. సూర్యకు ఫిట్‌నెస్ విషయంలో స్ఫూర్తి బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ ఖాన్. ఇదే విషయాన్ని సూర్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అమీర్ ఖాన్‌ను చూసాకే తాను కూడా సిక్స్ ప్యాక్ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అయితే సూర్య ఇంత చక్కటి శరీరాకృతిని ఎలా మెయింటైన్ చేస్తున్నాడని మీకు ఎప్పుడైనా అనిపించిందా? సూర్య ఫిట్‌నెస్ రహస్యం ఏంటో తెలుసా? ఆయన ఏం డైట్ ఫాలో అవుతారో తెలుసా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ తప్పక చదవాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూర్య.. అద్భుతమైన శరీరాకృతిని సాధించడానికి రోజూ జిమ్‌కి వెళ్లి ఖచ్చితంగా రెండు గంటల పాటు వ్యాయామం చేస్తారు. ఎంత బిజీ షూట్ షెడ్యూల్స్‌లో ఉన్నా కూడా జిమ్‌లో వర్కవుట్స్ చేయడం మానరు. ‘సింగం’లో పోలీసుగా.. అలాగే త్వరలో రానున్న ‘కంగువ’లో యోధుడిగా ఆయా పాత్రలను బట్టి, తన ట్రైనర్ సూచనల మేరకు శిక్షణను మార్చుకుంటూ ఉంటారు. సూర్య తన వ్యాయామ సమయంలో కార్డియో తప్పనిసరిగా చేస్తారు. ముందుగా 30 నిమిషాల కార్డియోతో శరీరాన్ని ప్రిపేర్ చేస్తారు. తర్వాత సుమారు 90 నిమిషాల పాటు కండరాలను పెంచే వ్యాయామాలు చేస్తారు. ఇతర వ్యాయామాలలో స్టాటిక్ హ్యాంగింగ్ లెగ్ రైజ్‌లు, హాంగింగ్ ఏటవాలు రైజ్‌లు, హ్యాంగింగ్ లెగ్ రైసెస్, చిన్-అప్స్ మరియు పుల్-అప్‌లు వంటివి చేస్తారు.

ఇక సూర్య హార్డ్‌కోర్ వ్యాయామాలతో పాటు యోగా, ధ్యానం మరియు జాగింగ్‌ కూడా చేస్తారు. వృత్తిగత ఒత్తిడి నుండి ఉపశమనం కోసం యోగా మరియు ధ్యానం చేస్తారు. ఇక ఈ ఫిట్‌నెస్‌ సాధించాలంటే.. ఆరోగ్యకరమైన మరియు మంచి పోషక విలువలున్న ఆహారం తప్పనిసరి. ఈ క్రమంలో స్టెరాయిడ్స్ మరియు కృత్రిమ కొవ్వు బర్నర్‌లకు సూర్య దూరంగా ఉంటారు. అలాగే ఉప్పు, పంచదార వంటివాటికి పూర్తి దూరం పాటిస్తారు. పాలు, పళ్ళు మరియు ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే ఆయన తీసుకుంటారు. ఇన్ని నియమాలు పాటిస్తారు కనుకే ఇప్పటికీ సూర్య అంత ఫిట్‌గా కనిపిస్తారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − eleven =