పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సలార్. పుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది. గత ఏడాదే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లినా మధ్యలో ప్రభాస్ ఆది పురుష్ తో బిజీగా ఉండటంతో ఈసినిమా ఇంకా పూర్తి కాలేదు. అయితే దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది.. మరికొద్ది రోజుల్లో షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది. మరోవైపు ఈసినిమా నుండి సాలిడ్ అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి త్వరలో ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇదిలా ఉండగా ఈసినిమా సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే కదా. ఈనేథ్యంలో తాజాగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. రిలీజ్ సరిగ్గా ఇంకా 100 రోజులు ఉండటంతో సలార్ విట్ నెస్ ను చూసేందుకు ఇంకా 100 రోజులు ఉందంటూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Time to give the world the CPR it needs. Get ready for #Salaar on Sep 28, 2023🔥#Prabhas #PrashanthNeel #VijayKiragandur @hombalefilms @PrithviOfficial @shrutihaasan @bhuvangowda84 @RaviBasrur @SalaarTheSaga pic.twitter.com/Nd3Yl79Yhq
— Salaar (@SalaarTheSaga) June 20, 2023
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: