ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై.. ఆతరువాత విలన్ గా కూడా చేసి తన టాలెంట్ చూపించి అందర్నీ మెప్పించి.. ఆ తరువాత యాక్షన్ హీరోగా మారిన నటుడు గోపీచంద్. తన కెరీర్ లో పలు డిఫరెంట్ కథలతో అలరించాడు.. అలరిస్తూనే ఉన్నాడు. అయితే ప్రస్తుతం కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాదాపు చాాలా ఏళ్లు సరైన హిట్ లేక వెనకపడిపోయాడు. అయినా కూడా నిరాశ చెందకుండా సినిమాలు చేసుకుంటూనే వెళుతున్నాడు. ఆమధ్య సీటీమార్ సినిమాతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్ గా రామబాణం అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వచ్చాడు. అది మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సినిమాను కూడా ప్రారంభించేశాడు. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా సినిమా వస్తుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉండగా నేడు గోపీచంద్ పుట్టినరోజు సందర్బంగా ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. భీమా అనే టైటిల్ ను ఈసినిమాను ఫిక్స్ చేశారు. అంతేకాదు పోస్టర్ ను బట్టి ఈసినిమాలో మరోసారి పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నట్టు అర్థమవుతుంది.
కాగా ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్వామి జే సినిమాటోగ్రాఫర్ కాగా, కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇక సినిమాలో నటించే హీరోయిన్ ఇంకా ఇతర నటీనటుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: