గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా రామాబాణం. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. దీంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక మే 5వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక ఈవిషయాన్ని శ్రీవాస్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ సెన్సార్ బృందం తమ సినిమాను ప్రశంసించినట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎంతో ఇష్టపడి, కష్టపడి తీసిన సినిమా సెన్సార్ కి వెళ్లినప్పుడు ఏమైనా కట్స్ చెప్తారా? అని ప్రతి మూవీకి ఎంతోకొంత టెన్షన్ ఉంటుంది. కానీ నాకు రామబాణం విషయంలో ఆ టెన్షన్ కొంచం తక్కువే ఉంది.. ఈరోజు మా రామబాణం మూవీని సెన్సార్ ఆఫీనర్ అండ్ టీమ్ చూశాక నన్ను, మా కో ప్రొడ్యూసర్ వివేక్ గారికి లోపలికి పిలిచి ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీశారు..మేము ఎంత వెతికినా ఒక్క ఆడియో కట్ కానీ.. వీడియో కట్ కానీ మాకు దొరకలేదు అని మమ్మల్ని కంగ్రాట్యూలేట్ చేసి కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి కాబట్టి యూఏ ఇస్తున్నాం అని పంపించారు. థాంక్స్ టూ సెన్సార్ టీమ్.. మే 5న మా మూవీ రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ కూడా ఇలాన్ ఫీల్ అయ్యి మా రామబాణం మూవీని బ్లాక్ బస్టర్ చేస్తారని ఆశిస్తున్నా అని తెలిపారు.
https://t.co/2UEsy3ODHJ pic.twitter.com/Iqewu4efpE
— Sriwass Oleti (@DirectorSriwass) April 26, 2023
కాగా ఈసినిమాలో ఇంకా జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈసినిమా మే 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: