ఈరోజుల్లో ఒక సినిమా 50 రోజులు లేదా 100 రోజులు ఆడిదంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. సూపర్ హిట్ సినిమాలు నెల రోజుల ముందే థియేటర్ల నుండి వెళ్లిపోతున్నాయి. అయితే ఈమధ్య మళ్లీ పూర్వ వైభవం కనిపిస్తుంది. అప్పుడప్పుడు మన తెలుగు సినిమాలు కూడా 50రోజులు, 100 రోజులు థియేటర్లలో పూర్తిచేసుకుంటున్నాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయి అందరి మన్నలు పొందుతున్న బలగం సినిమా కూడా అలాంటి రేర్ ఫీట్ ను సొంతం చేసుకుంది. వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా ఎంత మంచి విజయాన్ని అందుకుందో చూశాం. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా పెద్ద సక్సెస్ ను అందించింది మేకర్స్. దిల్ రాజు వేణు మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా తనక ఇచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకున్నాడు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా పదిరెట్లు లాభాలు అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి ఈసినిమా ఏదో ఒకరకంగా పలు రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. ఇక్కడ మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా ఈసినిమా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈసినిమా 50 రోజులను పూర్తి చేసుకుంది. అది కూడా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది.
కాగా ఈసినిమాలో కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, జయరాం, విజయలక్ష్మీ, స్వరూప కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు సమర్పణలో దిల్ రాజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈసినిమాకు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: