లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేయాలని ఉంది

i am eagerly waiting to act in a female centric movie says pooja hegde

ప్రస్తుతం స్టార్లు హీరోయిన్లు కూడా ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్లు చాలామంది లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు అనుష్క ఇలాంటి సినిమాలు చేయడానికి ముందుండేది.. ఆ తరువాత నయనతార, ఇక ఇప్పుడు సమంత కూడా అదే జాబితాలో చేరిపోయింది. ఇక రష్మిక కూడా ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే రీసెంట్ గానే రెయిన్ బో అనే లేడీ ఒరియెంటెడ్ సినిమాను చేయడానికి రెడీ అయిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూడా లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేయాలని ఆసక్తిగా ఉంది అంటుంది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు పూజా హెగ్డే. ప్రస్తుతం పూజా హీరోయిన్ గా హిందీలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా కిసీ కా బాయ్ కిసీ కీ జాన్ అనే సినిమా. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది పూజాహెగ్డే. ఈనేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజాహెగ్డే ఫీమేల్ ఒరియెంటెడ్ సినిమాలు చేయాలని ఉందని తెలిపింది. కమర్షియల్ మూవీస్ లో నటించడం హ్యాపీగానే ఉంది.. కానీ లేడీ ఒరియెంటెడ్ సినిమాలు కూడా చేయాలని ఉందని.. తనలోని యాక్టింగ్ ఎబిలిటీస్ ను ఫ్యాన్స్ కు చూపించాలని ఉందని.. ఆ అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది. మరి చూద్దాం పూజా హెగ్డే కోరిక మేరకు ఎవరైనా ఆమెకోసం కథను తయారు చేస్తారేమో..

కాగా ఇప్పటికే కొన్నాళ్లుగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న పూజా హెగ్డే తెలుగుతో పాటు తమిళ్, అలానే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలతో బిజీగా ఉంది. అల్లు అర్జున్ తో దువ్వాథ జగన్నాథం సినిమాతో మొదట సక్సెస్ ను అందుకున్న పూజాహెగ్డే ఆ తరువాత పెద్దగా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస హిట్లను అందుకుంటూ లక్కీ హీరోయిన్ అయింది. ప్రస్తుతం తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దీనితో పాటు ఇంకా పలు సినిమాలు పూజా లిస్ట్ లో ఉన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + eighteen =