ఇది భారత సినీ పరిశ్రమకు దక్కిన గౌరవం

Director Rajamouli Speech In Hca Awards Show,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,RRR Movie,RRR,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Movie Latest News,Director Rajamouli Speech In Hca Awards Show,In Hca Awards Show Director Rajamouli Talk,Director Rajamouli Presentation About RRR In Hca Awards Show,Director Rajamouli Address About RRR Movie In Hca Awards Show,RRR,RRR Movie

దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు సినీ పరిశ్రమనే కాదు మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమ గర్వపడేలా చేశారు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం. ఈసినిమా కోసం రిలీజ్ కోసం దాదాపు నాలుగేళ్లు టైమ్ పట్టింది. ఇక ఈసినిమాలో హీరోలుగా చేసిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సైతం వేరే సినిమాలను కూడా కమిట్ అవ్వకుండా ఈసినిమా కోసమే పనిచేశారు. ఇక ఇప్పుడు వారి కమిట్ మెంట్ కు ఫలితం దక్కుతుంది. ఈసినిమా గత ఏడాది రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్స్ కూడా అదే భారీ స్థాయిలో రాబట్టుకుంది. వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది కొత్తరికార్డులు క్రియేట్ చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా పలు అంతర్జాతీయ అవార్డులను సైతం అందుకుంది. ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్‌ ఛాయిస్‌ సహా పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా ఇప్పుడు మరో నాలుగు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న హాలీవుడ్‌ క్రిటిక్‌ అసోసియేషన్‌ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా నాలుగు కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అవార్డులు గెలుచుకుంది. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం, బెస్ట్‌ యాక్షన్‌ ఫిలిం, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్‌ స్టంట్స్‌ కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు హెచ్‌సీఏ అవార్డులు వరించాయి. రాజమౌళి, కీరవాణి, రామ్‌చరణ్‌ ఈ అవార్డులను అందుకున్నారు.

ఇక ఈసందర్భంగా అవార్డ్ ప్రధానోత్సవాల్లో రాజమౌళి మాట్లాడుతూ.. హెచ్సీఏ అవార్డు ప్రకటించిన సభ్యులకు ధన్యవాదాలు. ఎంతో కష్టపడి స్టంట్స్ ను కొరియోగ్రఫీ చేసిన సాలొమన్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సులను కంపోజ్ చేసిన జూజీతో పాటు… ఇండియాకు వచ్చి, మా ఆలోచనను అర్థం చేసుకుని, కష్టపడి పని చేసిన ఇతర స్టంట్ మాస్టర్లందరికీ థ్యాంక్స్. ఈ చిత్రంలో రెండు, మూడు షాట్స్ లో మాత్రమే డూప్స్ ని వినియోగించాం. మిగిలిన షాట్లన్నీ తారక్, రామ్ చరణ్ స్వయంగా చేశారు. 320 రోజుల పాటు ఈ చిత్రాన్ని షూట్ చేస్తే అందులో ఎక్కువ రోజులు స్టంట్స్ కోసమే పని చేశాం. ఇది కేవలం నాకు, నా సినిమాకు మాత్రమే దక్కిన గౌరవం కాదు. యావత్ భారతదేశ చిత్రపరిశ్రమకు దక్కిన గౌరవం అంటూ తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =