వరుస బ్లాక్ బస్టర్ అఖండ, వీర సింహారెడ్డి మూవీస్ తో దూసుకుపోతోన్న నందమూరి బాలకృష్ణ #NBK 108 మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK108 మూవీ తెరకెక్కుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ లో శరత్ కుమార్, శ్రీ లీల కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ రాంపాల్, హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించే అవకాశం ఉంది. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#NBK108 మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకోగా, బాలయ్య ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకోవడంతో ఇప్పుడు ఈ సినిమాకు బ్రేక్ పడింది. నిజానికి బాలయ్య 108వ చిత్రానికి సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్‌ను ఫిబ్రవరి 24 నుంచి మొదలుపెట్టాలని అనిల్ రావిపూడి భావించారు . కానీ, తారకరత్న మరణంతో ఈ షెడ్యూల్ వాయిదా పడింది. కొత్త షెడ్యూల్‌ను మార్చి 12 నుంచి మొదలుపెట్టాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో బాలయ్య మూడు వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ తో పాటు అనిల్ రావిపూడి తాలూకు కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: