అఖండ తరువాత దాదాపు ఏడాది తరువాత నందమూరి బాలకృష్ణ ఇప్పుడు వీరసింహారెడ్డి తో వచ్చేస్తున్నాడు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి సినిమాను రూపొందిస్తోన్నాడు. సంక్రాంతికి ఈసినిమా బరిలోకి దిగనున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పాటలు రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక రిలీజ్ కావాల్సిన నాలుగో పాటను వాయిదా వేస్తూ.. ట్రైలర్ ను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్టు ఇప్పటికే మేకర్స్ తెలిపిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 6వ తేదీన భారీగా నిర్వహించనున్నారు. ఒంగోలు లోని ఏబీఎమ్ కాలేజీలో సాయంత్రం 6 గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది.
Ongole, get ready to welcome the GOD OF MASSES 💥#VeeraSimhaReddy Grand Pre Release Event on 6th Jan from 6 PM onwards 🔥
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @OfficialViji @MusicThaman @RishiPunjabi5 @SonyMusicSouth pic.twitter.com/22XCS6MYLW
— Mythri Movie Makers (@MythriOfficial) January 3, 2023
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: