న్యూజెర్సీ లో తొలిసారి ఎన్టీఆర్ విగ్రహం

First NTR Statue In New Jersey,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,NTR Statue,NTR Statue In New Jersey,North America Seemm Andhra Association,NASAA,First Ever Statue of legendary actor NTR,First Ever Statue of NTR,First Ever Statue of NTR In New Jersey,Legend NTR Statue In Edison City,NTR's Statue Installed In Edison City Of New Jersey,Nandamuri Taraka Rama Rao Statue,NASAA's Endeavour,Sr NTR Statue Installed In Edison City,Sr NTR,Sr NTR Movies,Sr NTR Songs,Sr NTR Full Movies,Sr NTR Statue,Sr NTR Statue In New Jersey,Sr NTR Statue News,NTR News,NTR Movies

తెలుగు సినీ చరిత్రలో నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు వేసిన ముద్ర గురించి చెప్పడం ఆసాధ్యం. తెలుగు సినీ పరిశ్రమ బ్రతికి ఉన్నంతకాలం ఆయన కూడా సజీవంగా ఉన్నట్టే. ఆయన ఏ పాత్ర చేస్తే ఆపాత్ర కోసం ఆయన పుట్టినట్టు చేస్తారు. యావత్ ప్రపంచ చలన చిత్ర రంగంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నెలకొల్పినన్ని రికార్డులు నెలకొల్పటం మరి ఏ ఇతర నటుడికి సాధ్యం కాదు. సాంఘికమైనా, జానపదమైనా, పౌరాణికమైనా.. పాత్ర ఏదైనా ఆయనకు నల్లేరు మీద నడకే. సాంఘిక చిత్రాలు ఎన్టీఆర్ కు నటుడిగా మంచి గుర్తింపునిస్తే.. పౌరాణిక చిత్రాలు మాత్రం ఎన్టీఆర్ ను ఆకాశానికెత్తేశాయి. పురాణాల్లో చెప్పుకునే శ్రీకృష్ణుడు, రాముడు, రావణుడు, దుర్యోదనుడు, కర్ణుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాత్రలు.. ఆ పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తే దేవుడంటే ఇలానే ఉంటాడేమో.. శ్రీకృష్ణుడు, రాముడు ఇలానే ఉంటారేమో అన్నట్టుగా ఉండేవారు. అప్పట్లో ఎన్టీఆర్ ఫొటోను పెట్టి పూజించిన వాళ్లు కూడా లేకపోలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా విజయ కేతనం ఎగరవేశారు. అన్నా అని ప్రతి తెలుగు వారు పిలుచుకునేలా చేశారు. 1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన రికార్డును కూడా ఆయనే సొంతం చేసుకున్నారు. ప్రాంతీయ పార్టీల బలం ఎలా ఉంటుందో చూపించారు.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. న్యూజెర్సీలో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని నార్త్ అమెరికా సీమ ఆంధ్రా అసోసియేషన్‌ ప్రతినిధులు వెల్లడించారు. 2023లో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా లెజెండరీ నందమూరి తారక రామారావు ప్రతిష్ఠాపన, ప్రారంభోత్సవం కోసం న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో భూమిని కేటాయించడానికి ఎడిసన్ సిటీ మేయర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాత మరియు వ్యవస్థాపకుడు టీజీ విశ్వప్రసాద్ న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రతిపాదనను తీసుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =