#NBK 108 -వర్సటైల్ యాక్టర్ తో వర్కింగ్

Versatile Actor Sarathkumar In #NBK108, Sarathkumar In #NBK108, Versatile Actor Sarathkumar, Actor Sarathkumar, #NBK108, Nandamuri Balakrishna, Balakrishna, Trisha Krishnan, Sarathkumar, Anil Ravipudi, Balakrishna Movies, Balakrishna Latest Movie, Balakrishna Upcoming Movie, NBK108, NBK108 2023, NBK108 Movie, NBK108 Update, NBK108 Latest News, NBK108 Telugu Movie, NBK108 Movie Live Updates, NBK108 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

బాలకృష్ణ-అనిల్ రావిపూడిలాంటి క్రేజీ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది బాలకృష్ణ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గానే అనిల్ కూడా ఎఫ్3 తో తన హిట్స్ లిస్ట్ లో మరో హిట్ ను చేర్చుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఇప్పటి వరకూ కామెడీ యాంగిల్ తో అలరించిన అనిల్ రావిపూడి ఇప్పుడు బాలకృష్ణతో మాస్ ఎంటర్ టైనర్ తీయబోతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా రీసెంట్ గానే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇక ఈసినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమాకు సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఈసినిమాలో సీనియర్ నటుడు శరత్ కుమార్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈవిషయాన్నిఅనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. వర్సటైల్ యాక్టర్ శరత్ కుమార్ గారితో వర్క్ చేయడం చాలా గౌరవంగా ఉందని శరత్ కుమార్ తో ఉన్న ఫొటో ను పోస్ట్ చేశాడు.

కాగా ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇక ఈసినిమాలో బాలకృష్ణ కుమార్తెగా శ్రీలీల అలరించనుందంట. ప్రియాంక్ జవాల్కర్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − twelve =