ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా , అమృత అయ్యర్ ప్రధాన పాత్రలలో సూపర్ హీరో మూవీ హనుమాన్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో వరలక్ష్మీ శరత్ కుమార్ , వినయ్ రాయ్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హనుమాన్ మూవీ కి అనుదీప్ దేవ్ , హరిగౌర , కృష్ణ శౌరభ్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. హనుమాన్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. తాము ఈ సినిమాను ఎంతో కష్టపడి చేస్తున్నామని, ప్రేక్షకులు తమ కష్టాన్ని గుర్తిస్తున్నందుకు సంతోషంగా ఉందని చిత్ర యూనిట్ అంటోంది. అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ అయోధ్య రామ మందిరాన్ని సందర్శించేందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తోంది. రాముడి అపరభక్తుడైన హనుమాన్ తమ సినిమా నేపథ్యం కావడంతో శ్రీరాముడి దీవెనలు తీసుకునేందుకు హనుమాన్ చిత్ర యూనిట్ నవంబర్ 29న అయోధ్యకు పయనమవుతున్నట్లు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: