సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి 43 ఏళ్లు అవుతుంది. అదేంటీ అనుకుంటున్నారా..? అంటే బాలనటుడిగా తెలుగు తెరకు పరిచయమై 43 ఏళ్లు అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన సినిమా నీడ సినిమా. 1979 నవంబర్ 29వ తేదీన ‘నీడ’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈసినిమా అప్పట్లో మంచి విజయం దక్కించుకుంది. ఇక నేటితో ఈసినిమా విజయవంతంగా 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. అయితే ఈసినిమాలో సూపర్ స్టార్ తనయుడు రమేష్ బాబు కూడా ఒక పాత్రలో నటించాడు.. మహేష్ బాబు కూడా నటించారు. బాలనటుడిగా ఈసినిమాతోనే పరిచయమయ్యాడు మహేష్ బాబు. ఇక ఈసినిమాను తెలుగు చిత్ర బ్యానర్ మీద రామినేని సాంబశివరావు నిర్మించారు. పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి ఈసినిమాలో కీలకపాత్రలో నటించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయనకి కూడా ఇది ఫస్ట్ సినిమానే కావడం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: