వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో వారిసు అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కిస్తుండగా.. తెలుగులో వారసుడు అనే టైటిల్ తో రూపొందించనున్నారు. నిజానికి ఈసినిమాను మొదటినుండి స్ట్రైయిట్ తెలుగు సినిమా అనుకున్నారు కానీ ఇటీవలే ఈసినిమా తెలుగు సినిమా కాదు.. తమిళ్ లోనే రూపొందుతుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంత ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు. అలానే రీసెంట్ గానే రంజితమే అనే పాటను రిలీజ్ చేయగా.. ఆ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా తమిళ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ సొంతం చేసుకున్నట్టు తెలిపారు. సెవన్ స్క్రీన్ స్టూడియో సంస్థ ఈసినిమా తమిళ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకున్నట్టు తెలిపారు.
We are happy to announce that #Varisu TN theatrical distribution will be done by @7screenstudio 💥#Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman #VarisuPongal pic.twitter.com/P8MUkQCuQK
— Sri Venkateswara Creations (@SVC_official) November 20, 2022
ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. వారసుడు 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: