డెవిల్ కోసం కళ్యాణ్ రామ్ కసరత్తులు

Kalyan Ram Getting Ready For Devil Movie,Telugu Filmnagar,Tollywood Latest,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Tollywood Movies in 2022,Nandamuri Kalyan Ram,Kalyan Ram,Hero Kalyan Ram,Actor Kalyan Ram,Kalyan Ram Upcoming Movies,Kalyan Ram New Movie Updates,Kalyan Ram Upcoming Movie Updates,Kalyan Ram Latest Movie Updates,Kalyan Ram Devil Movie Updates,Kalyan Ram Upcoming Movie Devil,Kalyan Ram Getting Ready For Devil Telugu movie

ఈమధ్య కళ్యాణ్ రామ్ కూడా తన రూట్ మార్చి కొత్త ప్రయోగాలు చేయడానికి ముందుకొస్తున్నాడు. అలా రీసెంట్ గా బింబిసార సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. పీరియాడికల్ సినిమాగా వచ్చిన ఈసినిమాలో కళ్యాణ్ రామ్ డిఫరెంట్ పాత్రలో అలరించాడు. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో డెవిల్ సినిమా కూడా ఒకటి. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. నిజానికి ఈసినిమాను ఎప్పుడో ప్రారంభించారు. ఈసినిమా కూడా 1945 కాలం నాటి పీరియాడిక్ సినిమాగా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో కళ్యాణ్‌రామ్ ఈ సినిమాలో రహస్య గూఢాచారిగా కనిపించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్‌లు ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ కోసం కళ్యాణ్‌రామ్‌ కోసం కసరత్తులు మొదలు పెట్టాడు. ఈనేపథ్యంలోనే ఈయన జిమ్‌లో వర్కవుట్‌ చేస్తూ ఫొటో షేరు చేశారు. ఈ సందర్భంగా బింబిసార పై మీ ప్రేమను చూపించినందుకు ధన్యవాదాలు.. అమిగోస్ సినిమాతో మ్యాజిక్ చూపించడానికి వెయిట్ చేయలేకపోతున్నా.. ప్రస్తుతం అయితే డేవిల్ కోసం సిద్దమవుతున్నా అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

కాగా దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు హిందీ తమిళం మరియు కన్నడ భాషలలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + one =