తమిళ్ హీరో విష్ణు విశాల్ కూడా ఇప్పుడు వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇటీవలే తమిళ చిత్రం ఎఫ్.ఐ.ఆర్ లాంటి క్రైమ్ థ్రిల్లర్ తో మంచి హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చల్లా అయ్యవు దర్శకత్వంలో మట్టి కుస్తీ అనే సినిమాలో నటిస్తున్నాడు. చాలా రోజుల నుండి ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉండటంతో ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. అయితే రీసెంట్ గానే అప్ డేట్స్ ను ఇవ్వడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పాటు పలు పోస్టర్లను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇక తజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈసినిమాను డిసెంబర్ 2వ తేదీన ఈసినిమా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తుంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్ ఎం.నాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని విష్ణు విశాల్ స్టూడీయోస్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్‌లపై విష్ణు విశాల్, రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఇది రెండో సినిమా. ఈసినిమాకు వీరిద్దరికి మంచి సక్సెస్ ఇస్తుందేమో చూద్దాం..
ఇక డిసెంబర్ 2వ తేదీన హిట్ 2 తో పాటు పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. మరి అదే రోజున ఈసినిమా రిలీజ్ కాబోతుంది. చూద్దాం మరి ఆ పోటీని తట్టుకొని ఈసినిమా ఎలాంటి విజయాన్ని దక్కించుకుంటుందో.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: