మలయాళం సినిమాలకు కూడా ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే కదా. మన సినిమాలను వేరే భాషల్లో రీమేక్ లు చేసుకుంటూ మన తెలుగు వాళ్లకు మలయాళ సినిమాలపై కన్ను పడింది. అక్కడ సూపర్ హిట్ సినిమాలను ఇక్కడ రీమేక్ చేస్తున్నారు. ఇక్కడ కూడా సూపర్ హిట్లను కొడుతున్నారు. ఈమధ్య కాలంలో చాలా మలయాళం సినిమాలు రీమేక్ అయ్యాయి. అందులో పవర్ స్టార్ నటించిన భీమ్లానాయక్ ఉంది.. అలానే మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్ నటించిన భీమ్లానాయక్ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. ఇక ఇదే సినిమా పవన్-రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రీమేక్ అయింది. ఇక ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూశాం.
మరోవైపు చిరంజీవి ప్రధాన పాత్రలో రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా గాడ్ ఫాదర్. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్. ఈసినిమాను రీమేక్స్ తీయడంలో ఎక్స్పర్ట్ అయిన మోహన్ రాజా తెలుగు నేటివిటీకి తగ్గట్టు తీయడంతో సూపర్ హిట్ అయింది. అంతేకాదు దసరాకు రిలీజ్ అయిన సినిమాల్లో ఈసినిమా మాత్రం ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 150 కోట్ల వరకూ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.
మరి మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ మలయాళం రీమేక్ లలో మీకు ఏ రీమేక్ బాగా నచ్చిందో మీ ఓటు ద్వారా తెలపండి.
[totalpoll id=”88970″]
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: