విశ్వక్ సేన్ పై రామ్ చరణ్ ప్రశంసలు

Ram Charan Praises Vishwak Sen at Ori Devuda Pre Release Event, Ori Devuda Pre Release Event, Ori Devuda Movie Pre Release Event, Ram Charan Praises Vishwak Sen, Actor Ram Charan, Venkatesh Dagubatti, Vishwak Sen, Mithila Palkar, Asha Bhat, Ashwath Marimuthu, Ori Devuda, Ori Devuda Telugu movie, Ori Devuda New Update, Ori Devuda Telugu Movie New Update, Ori Devuda Movie, Ori Devuda Latest Update, Ori Devuda Movie Updates, Ori Devuda Telugu Movie Live Updates, Ori Devuda Telugu Movie Latest News, Ori Devuda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పివిపి సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ , మిథిలా పాల్కర్ జంటగా తమిళ సూపర్ హిట్ ఓ మై కడవులే మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఓరి దేవుడా..! మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. ఇద్దరు ప్రేమికులు పెళ్లి తరువాత మనస్పర్థల కారణంగా వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఓరి దేవుడా . ! చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సూపర్ హిట్ అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీ తో ప్రేక్షకులను అలరించిన యువ కథానాయకుడు విశ్వక్ సేన్ ఓరి దేవుడా . ! మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రాజమండ్రిలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని హీరో విశ్వక్ సేన్ పై ప్రశంసలు కురిపించారు.ఆ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ ప్రాంతాల్లోని గల్లీ గల్లీలో విశ్వక్ సేన్ పేరు తెలియని వారు లేరనీ , ఫలక్ నుమా నుంచి రాజమండ్రి వరకూ ఆయన మంచి పేరు సంపాదించుకున్నారనీ ,విశ్వక్ సేన్ కు రెబల్ ఫ్యాన్స్ .. రేజింగ్ ఫ్యాన్స్ ఉన్నారనీ , విశ్వక్ సేన్ పర్సనాలిటీకి తాను పెద్ద ఫ్యాన్ ని అనీ , ఇచ్చిన మాటపై నిలబడే వాళ్లంటే తనకు చాలా ఇష్టం అనీ , అలాంటి ఒక పేరు తనకూ ఉందనీ , విశ్వక్ కూడా అంతే ననే విషయం తనకు తెలిసిందనీ , ఒక రజనీ గారు .. చిరంజీవిగారు .. పవన్ కల్యాణ్ గారు సూపర్ స్టార్ లు అనిపించుకోవడానికి కారణం వారి వ్యక్తిత్వమేననీ , అలాంటి పర్సనాలిటీ విశ్వక్ సేన్ కి నిండుగా ఉందనీ , ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాననీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =