మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్ )మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్ ) మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.#MEGA154 మూవీ తాజా షెడ్యూల్ విశాఖపట్నం లో జరిగిన విషయం తెలిసిందే. విశాఖ షెడ్యూల్ లో చిరంజీవి , రవితేజ లపై సీన్స్ దర్శకుడు తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా #MEGA154 మూవీ డబ్బింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. దర్శకుడు బాబీ, పలువురు టెక్నీషియన్ల సమక్షంలో లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, డబ్బింగ్ కార్యక్రమాలు షురూ చేశారు. చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే ఈ చిత్రం నుంచి భారీ అప్ డేట్లు వస్తాయని సమాచారం. 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే ఈ మూవీ టైటిల్ పోస్టర్ , టీజర్ దీపావళి కి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: