ఈమధ్యకాలంలో రీమేక్ ల ప్రభావం ఎక్కువగా ఉందన్న సంగతి తెలిసిందే కదా. ఒక భాషలో హిట్ అయిన సినిమాలను ఇప్పుడు మరో భాషలో రీమేక్ చేసుకోవడం కామన్ అయిపోయింది. కేవలం ఇక్కడ సినిమాలను మాత్రమే కాదు విదేశాల్లో సినిమాలను కూడా రీమేక్ చేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా కొరియన్ సినిమాలను తెలుగులో రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం “శాకిని డాకిని”. ఈసినిమా సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం ‘మిడ్‌నైట్ రన్నర్స్’ కు రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా సెప్టెంబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. శిక్షణ కోసం పోలీసు అకాడమీలో చేరిన ఇద్దరమ్మాయిల కథతో ఈ సినిమా రూపొందినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. యాక్షన్, డ్రామా, హాస్యం మేళవింపుగా ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. ట్రైలర్‌లోని ఇద్దరి హీరోయిన్ల లుక్స్, పోరాట దృశ్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. మరోసారి ట్రైలర్ తో ఈసినిమాపై అంచనాలు పెంచేశారు. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
Presenting the fun-filled & fiery trailer of #SaakiniDaakini! 🔥⚡https://t.co/QjYp77BFlV#SDonSep16th @sudheerkvarma @ReginaCassandra @i_nivethathomas@SunithaTati @sureshprodns@gurufilms1 @MikeyMcCleary1 @rip_apart @kross_pictures @vijaydonkada @adityamusic pic.twitter.com/KF6XmzmckG
— Suresh Productions (@SureshProdns) September 12, 2022
కాగా సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పైఅధికారిక రీమేక్ గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం శాకిని డాకిని. ఈ సినిమాకు రిచర్డ్ ప్రసాద్ కెమెరామెన్‌గా, మిక్కీ మెల్క్రెరీ సంగీత దర్శకుడుగా, విప్లవ్ నైషధం ఎడిటర్ గా పని చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: