ఇండస్ట్రీపై కామెంట్స్ చేసేవాళ్లు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే నెపోటిజంపై ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు అమలా పాల్. తమిళ్ లో తన సినీ కెరీర్ ను ప్రారంభించిన అమలా పాల్ తన అందం, అభినయంతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే తమిళం, తెలుగు, మలయాళ పరిశ్రమల్లో సినిమాలు చేసి నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు పెద్దగా సినిమాలు కూడా చేయట్లేదు అమలాపాల్. మరోవైపు ఈ మధ్య వక్తిగత జీవితం వల్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమలా పాల్ తెలుగు ఇండస్ట్రీపై పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే ఇండస్ట్రీ కొంతమంది కుటుంబాల చేతిలో ఉందని అర్థమయింది. ఆ కుటుంబాలే ఇండస్ట్రీపై ఆధిపత్యం చేస్తాయని అర్థమైంది. చాలా కమర్షియల్ గా సినిమాలు చేసేవారని.. ఆ హీరోలు చేసే సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని.. హీరోయిన్లను రొమాంటిక్ సీన్స్, పాటలకు మాత్రమే పరిమితం చేసేవారని తెలిపింది. అందుకే తెలుగు ఇండస్ట్రీకి దగ్గర కాలేకపోయానని తెలిపింది.
కాగా తెలుగులో అమలా పాల్ చేసింది తక్కువ సినిమాలే. రామ్ చరణ్ హీరోగా వచ్చిన నాయక్ సినిమాలో ఇంకా ఇద్దరమ్మాయిలతో సినిమాలు చేశాడు. ఇక రెండు సినిమాల్లో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అయితే ఈమధ్య వచ్చే అన్ని సినిమాల్లోనూ ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు. అయితే అవకాశాలను అందిపుచ్చుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన హీరోయిన్లూ ఉన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























