లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక స్టార్ హీరో ఒక లెజెండరీ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ఇక ఈసినిమాను పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు శంకర్. అంతేకాదు ఈ మూవీలో చరణ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చాలా వరకూ శంకర్ షూటింగ్ పూర్తి చేసినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే గత కొద్దిరోజులుగా ఈసినిమాలో విలక్షణ నటుడు ఎస్ జే సూర్య కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈసినిమాలో ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మరి ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడన్నవార్తలు కూడా ఇప్పటికే వచ్చేశాయి. చూద్దాం మరి శంకర్ ఎస్ జే సూర్య ను ఎలాంటి యాంగిల్ లో చూపిస్తాడో. కాగా గతంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్ సినిమా లో ఈయన విలన్ గా నటించి మెప్పించాడు. ఆ పాత్ర లో సూర్య నటకు వంద కు వంద మార్కులు పడుతాయి.
Versatile actor @iam_SJSuryah joins our stellar cast!
Welcome on board sir @shankarshanmugh @AlwaysRamCharan@advani_kiara @yoursanjali @MusicThaman @DOP_Tirru @ramjowrites @saimadhav_burra @SVC_official #SVC50 #RC15 pic.twitter.com/Az5CQxIeta
— Sri Venkateswara Creations (@SVC_official) September 9, 2022
కాగా కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: