యంగ్ హీరో కార్తికేయ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా భజే వాయు వేగం. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా కూడా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా మే 31వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ల నుండి టీజర్ , పాటలు సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి. ఇప్పుడు ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ట్రైలర్ అనౌన్స్ మెంట్ ను త్వరలో ఇస్తామని తెలిపారు చిత్రబృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Gear up and get ready to feel the speed 🔥
Bringing you a 𝙈𝙖𝙨𝙨𝙞𝙫𝙚 𝙎𝙬𝙞𝙣𝙜𝙚𝙧 in 10 Days 🏏💥#BhajeVaayuVegam releasing worldwide on May 31st 🎯
𝐓𝐫𝐚𝐢𝐥𝐞𝐫 𝐀𝐧𝐧𝐨𝐮𝐧𝐜𝐞𝐦𝐞𝐧𝐭 𝐒𝐨𝐨𝐧 🚘🏁#BVVonMay31st @ActorKartikeya @Ishmenon @RAAHULTYSON… pic.twitter.com/LPxIppnB7p
— UV Creations (@UV_Creations) May 21, 2024
కాాగా ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ హ్యాపీడేస్ రాహుల్ టైసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ లో ఈసినిమాను నిర్మిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్, సంగీతం రధన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – కపిల్ కుమార్ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































