‘అనుష్క’ ఎమోషనల్ పోస్ట్.. ఫ్యాన్స్ కు స్పెషల్ థ్యాంక్స్..!

Anushka Shetty Pens An Emotional Note,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Anushka Shetty,Actress Anushka Shetty,Anushka Shetty latest Movie Updates,Anushka Shetty Pens an Emotional Note in Social Media,Anushka Shetty Emotional Note in Social Media, Anushka Shetty Upcoming Movies,Anushka Shetty Emotional Note To Fans,Anushka Shetty Thanks Fans in Emotional Note,Anushka Shetty Emotional Note Goes Viral In social Media, Anushka Shetty Pens Down Emotional Note For Fans

2005 లో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనుష్క. నటన,డ్యాన్స్ అనేవి తెలియకపోయినా తన హార్డ్ వర్క్ తో ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కి తారాస్థాయికి చేరుకుంది. ఎంతో మంది స్టార్ హీరోస్.. ఎంతోమంది టాప్ డైరెక్టర్స్ తో నటించింది. తనదైన అందం, అభినయంతో అభిమానులను మెస్మరైజ్ చేయడం అనుష్క స్పెషాలిటీ. దేవసేన, భాగమతి, జేజమ్మ ఈ పాత్రలు అనుష్క కోసమే పుట్టాయి. ఆ పాత్రల్లో వేరే వాళ్ళని ఊహించుకోవడం కష్టమే. స్టార్ హీరోలకు పోటీగా ఆమె కోసం పాత్రలు రాసే స్థాయికి ఎదిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక బాహుబలి తరువాత కొన్ని సినిమాలు చేసిన అనుష్క ఆ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చింది.
అయితే అనుష్క ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈనేపథ్యంలో ఆమెకు ఇన్నేళ్లు అండగా నిలిచిన వారికి థ్యాంక్స్ చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. 17 ఏళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో సెలబ్రేషన్స్ చేసుకున్న అనుష్క తన ట్విట్టర్ ద్వారా.. ఇన్నేళ్ల నుండి తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు.. ముఖ్యంగా తన వెంట ఉండి, ధైర్యాన్ని బలాన్ని ఇస్తున్న ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఎమోషనల్ గా థ్యాంక్స్ చెప్పింది. అలానే తన కెరీర్ ఈ స్థాయిలో ఉండడానికి తల్లితండ్రులతో పాటు కెరీర్ లో వర్క్ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కూడా థ్యాంక్స్ తెలిపింది.

కాగా అనుష్క ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. నవీన్ పోలిశెట్టి కూడా ఈసినిమాలో నటిస్తున్నాడు. మహేష్ బాబు న్యూ ఇమేజ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.