‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Macherla Niyojakavargam Movie Trailer Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nithiin,Hero Nithiin,Nithiin Macherla Niyojakavargam Movie,Nithiin Macherla Niyojakavargam Telugu Movie,Nithiin Macherla Niyojakavargam Movie latest Trailer Updates, Nithiin Macherla Niyojakavargam Movie Trailer,Macherla Niyojakavargam Trailer,Macherla Niyojakavargam Movie Trailer,Macherla Niyojakavargam Trailer Updates, Macherla Niyojakavargam Trailer Release Date Fixed,Macherla Niyojakavargam Trailer Updates,Krithi Shetty and Nithiin Upcoming Movie Macherla Niyojakavargam Trailer Release Date Fixed

యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీలో సిద్దార్ధ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా పాత్రలో నితిన్ కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనలిభాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పలు అప్ డేట్లు ఇచ్చారు మేకర్స్. రీసెంట్ గా రిలీజ్ చేసిన రారా రెడ్డి సాంగ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఒకేసారి పలు అప్ డేట్లతో వచ్చేశారు. తాజాగా ట్రైలర్ అప్ డేట్ తో పాటు మరో రెండు అప్ డేట్లు కూడా ఇచ్చింది చిత్రయూనిట్. జులై 23 న థర్డ్ సింగల్ అదిరిందే పాటని విడుదల కానుంది. జూలై 26న మాచర్ల ధమ్కి రాబోతుంది. జూలై 29న ‘మాచర్ల నియోజకవర్గం’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తునట్లు నిర్మాతలు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. కేథరిన్ థ్రెసా ఈ సినిమాలో మరో కథానాయిక గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 8 =