మనం సినిమా తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఈసినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇక వీరితోపాటు బీవీఎస్ రవి కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఈసినిమా ఫైనల్ కట్ చూసినప్పుడు రవి తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. థాంక్యూ సినిమా ఫైనల్ కట్ చూశాను.. చై ఫ్యాన్స్ అందరికీ నేను హామీ ఇస్తున్నాను.. అభిరామ్ పాత్రలో చైతు కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు.. ఖచ్చితంగా మీకు మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది అని చెప్పాడు. ఇక ఇప్పుడు మరోసారి తన ట్విట్టర్ ద్వారా.. విక్రమ్ కుమార్ హార్ట్ ఫుల్ ప్రెజెంటేషన్ అలానే పీసీ శ్రీరామ్ అందించిన అందమైన విజువల్స్ ద్వారా మంచి మెసేజ్ ఇచ్చే సినిమా ఇది అని.. ఈసినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#ThankYouTheMovie spreads a wonderful message of gratitude through the beautiful visuals of @pcsreeram sir and heartfelt presentation of @Vikram_K_Kumar & @chay_akkineni Bookings have opened&get ready for an emotional carousel.@RaashiiKhanna_ @SVC_official @MusicThaman
— BVS Ravi (@BvsRavi) July 20, 2022
ఈసినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. అవికా గోర్,మాళవిక నాయర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: