టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ”ఖుషి”మూవీ లో విజయ్ కు జోడీగా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ది ఫ్యామిలీ మేన్2″ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంత త్వరలోనే బాలీవుడ్ లో ఎంటర్ కానున్నారు.తాజాగా సమంత ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానం అందుకున్నారు . ఆగస్ట్ 12 నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ వార్త ఇండియన్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది.ఈ సందర్బంగా సమంత మాట్లాడుతూ.. గత సంవత్సరం IFFMలో భాగమయ్యాననీ , ఇప్పుడు భారతీయ సినిమా ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రాతినిధ్యం వహించనుండడం తనకు చాలా గర్వంగా ఉందనీ , దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాననీ , భారతీయ సినిమాల్ని, భారతీయులు, సినీ ప్రేమికులు ఇలా ఇతరులందరినీ ఇలా ఒక్క చోట చేర్చడం అన్నది గొప్ప అనుభూతి అనీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: