శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ఓ పవర్‌ఫుల్ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో నటిస్తున్నారు. ఈసినిమా కోసం రవితేజ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కానీ లేట్ అవుతూ వస్తుంది. ఫైనల్ గా జులై 29వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు, టీజర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ లోడింగ్ అంటూ అప్ డేట్ ఇచ్చారు. తాాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ దీనికోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 16న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఓ కొత్త పోస్టర్ ద్వారా వెల్లడించింది.
కాగా ఈసినిమాలో దివ్యాంక కౌశిక్, రజిష విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణు తొట్టెంపూడి, నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలో రవితేజ పర్ఫార్మెన్స్ మాస్ ఆడియెన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. చూద్దాం ఈసినిమా రవితేజకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: